News April 24, 2024
NGKL: జోరుగా ప్రచారం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీపై విమర్శలకు పదును పెడుతున్నారు.
Similar News
News March 9, 2026
MBNR: డిగ్రీ.. దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్‌నగర్‌లోని(దొడ్డలోనిపల్లి) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నూతన ఏడాదికి గాను అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నేరుగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, రిజర్వేషన్ & మెరిట్ ఆధారితంగా సీట్లు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 9, 2026
MBNR: ఈనెల 11 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 1వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.
News March 7, 2026
MBNR: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

స్వల్ప గొడవ విషయంలో తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నవాబుపేట మండలం గురుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ (21) అనే యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. హోలీ వేడుకల్లో స్నేహితులతో గొడవపడటంతో ఇంటి పెద్దలు మందలించారు. దీనిని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.


