News December 31, 2025

నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్

image

నారాయణపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ నియమించిన నారాయణ్ అమిత్ మాలెంపాటి నియామకాన్ని రద్దు చేస్తూ, ఉమాశంకర్ ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Similar News

News January 13, 2026

సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోండి: తిరుపతి DEO

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోపు సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలని తిరుపతి DEO KVN కుమార్ సూచించారు. త్వరలోనే అర్హులైన వారి జాబితా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వస్తుందన్నారు. అర్హుల జాబితాను https://www.bse.ap.gov.in వెబ్‌సైట్లో పెడతారని చెప్పారు. HMలు, తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News January 13, 2026

Photo Gallery: సంక్రాంతి సంబరాల్లో సీఎం

image

AP: తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో CM చంద్రబాబు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, బాలయ్య మనవళ్లు కూడా పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి గిఫ్ట్స్ అందజేశారు.

News January 13, 2026

కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా..! రెవెన్యూ డివిజన్..?

image

విభజనపై జిల్లా వాసుల్లో, రాజకీయ నేతల్లో కలకలం మొదలైంది. జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రాగా అధికారికంగా ప్రకటన చేయలేదు. కొడంగల్ విషయంలో ఏదైనా కొత్త నిర్ణయం జరగవచ్చని చెబుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొంతకాలంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా లేదా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చసాగుతోంది.