News December 31, 2025
వారెన్ బఫెట్ వీడ్కోలు: వ్యాపార దిగ్గజాలు నేర్చుకున్న పాఠాలివే!

బెర్క్‌షైర్ హాత్‌వే CEOగా వారెన్ బఫెట్ తన సుదీర్ఘ ప్రస్థానాన్ని నేటితో ముగించనున్నారు. 95 ఏళ్ల వయసున్న ఈ పెట్టుబడి దిగ్గజం నుంచి నేర్చుకున్న పాఠాలను వ్యాపారవేత్తలు గుర్తుచేసుకుంటున్నారు. క్లిష్టమైన విషయాలను సరళంగా చెప్పడం, ఓపికతో లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్ చేయడం బఫెట్ ప్రత్యేకత. డబ్బు కంటే నైతికతకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సంపద మనిషిని బందీ చేయకూడదని నమ్మి.. తన ఆస్తిని దానధర్మాలకు కేటాయించారు.
Similar News
News January 17, 2026
100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్‌ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్‌లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్‌ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
News January 17, 2026
ఇరాన్ నుంచి వెెనుదిరుగుతున్న భారతీయులు

అంతర్గత నిరసనలు, మరోపక్క USతో యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని అక్కడి ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దేశంలో 9000 మంది భారతీయులుండగా వీరిలో విద్యాభ్యాసం కోసం వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. కమర్షియల్ విమానాలు ప్రస్తుతం తిరుగుతున్నందున ఇరాన్ వీడి వెళ్లడం మంచిదని సూచించింది.
News January 17, 2026
యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

TG: రాష్ట్రంలో పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్(నాన్ క్యాడర్)ను నియమించింది. మొన్నటి వరకు ఈవోగా ఉన్న వెంకట్రావు అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. ఇక ఆసిఫాబాద్ కలెక్టర్‌గా కె.హరిత, ఫిషరీస్ డైరెక్టర్‌గా కె.నిఖిల, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేశ్ ధోత్రేను సర్కార్ బదిలీ చేసింది.


