News December 31, 2025
NLG: ఈ ‘పాప’o ఎవరిది?

పడక సుఖమే కారణమో లేక.. పెంచాలేనన్న భయమో తెలీదు కానీ గర్భస్థ <<18720257>>ఆడ శిశువు<<>>ను మురికి కాల్వలో పడేసింది ఓ తల్లి. నెలలు నిండని ఆ శిశువు ఉక్కిరిబిక్కిరై కాల్వలోనే ఊపిరి వదిలింది. మిర్యాలగూడలో జరిగిన ఈ అమానుష ఘటన అమ్మతనానికే కలంకం తెచ్చింది. పెంచే స్తోమత లేకుంటే బిడ్డ పుట్టాక ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చేర్చడం, అధికారిక దత్తతపై అవగాహన కల్పిస్తున్నా కర్కశ తల్లి మనసు కరగకపోవడం స్థానికులను కలచి వేసింది.
Similar News
News January 13, 2026
ఐఫోన్ యూజర్లకు అలర్ట్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.
News January 13, 2026
దీపికకు రాష్ట్రపతి ఆహ్వానం

దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు ఆహ్వానం అందింది. అమరాపురం(M) తంబలహట్టిలో దీపికకు ఈ ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు అందజేశారు. రాష్ట్రపతి ఆహ్వానం రావడంతో మండల వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దీపికను అభినందించారు. ఇది గ్రామానికే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్‌లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్‌లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.


