News April 24, 2024

మీ క్షమాపణ.. యాడ్ సైజ్‌లోనే ఉందా? పతంజలిపై సుప్రీం ఫైర్

image

తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడిన పతంజలిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. బాబా రాందేవ్, బాలకృష్ణ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ‘కోర్టును క్షమాపణ కోరుతూ పతంజలి రూ.10లక్షల ఖర్చుతో 67 న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చింది’ అని కోర్టుకు తెలిపారు. దీంతో ‘మీరిచ్చిన యాడ్స్ సైజ్‌, ఫాంట్ తరహాలోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా?’ అని SC ప్రశ్నించింది. తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది.

Similar News

News March 16, 2026

G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల పెరుగుదల ఇలా: TBJP

image

యుద్ధం కారణంగా పెట్రో మంటతో అగ్రరాజ్యాలు అల్లాడుతున్నా మన దేశంలో ధరల నియంత్రణ పక్కాగా ఉందని TBJP పేర్కొంది. సామాన్యుడిపై భారం పడకుండా దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్న PM మోదీ సమర్థ నాయకత్వానికి ఈ గణాంకాలే నిదర్శనమంటూ G20 దేశాల్లో పెట్రోల్ రేట్ల జాబితాను Xలో పోస్ట్ చేసింది. FEB 1-MAR 12 మధ్య రేట్ల మార్పును ఇందులో పొందుపర్చింది. USలో అత్యధికంగా 22% పెరగగా INDలో మార్పు లేదని వెల్లడించింది.

News March 16, 2026

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం

image

భార్యే ఇంటికి మహాలక్ష్మి. ఆమె చేసే పనులే భర్త ఆయురారోగ్యాలకు, ఐశ్వర్యానికి కారణమవుతాయి. ఆమె తులసి కోట వద్ద దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సానుకూల శక్తి పెరుగుతుందట. ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఉపవాసాలు ఉంటే వైవాహిక బంధం బలపడుతుందట. సాయంత్రం వేళ ఇంటి ముంగిట, పూజ గదిలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇల్లాలి క్రమశిక్షణ, భక్తి ఆ ఇంట్లో ధన ధాన్యాలకు కొదువ లేకుండా చేస్తాయి.

News March 16, 2026

ప్రీ టర్మ్ బర్త్‌ను నివారించాలంటే?

image

డెలివరీ డేట్ కంటే చాలాముందుగా డెలివరీ కావడాన్ని ప్రీ టర్మ్ డెలివరీ అంటారు. దీనివల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రతి నెలా రెగ్యులర్ చెకప్స్, పౌష్టికాహారం తీసుకోవాలి. మూత్రనాళ, దంత ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పొత్తికడుపులో నొప్పి, రక్తస్రావం, ఉమ్మనీరు లీక్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.