News December 31, 2025
అమరావతి ఐకానిక్ ‘ధ్యాన బుద్ధ’.. అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధ్యాన బుద్ధ విగ్రహం పల్నాడు జిల్లా అమరావతి సమీపంలోని ధరణికోట వద్ద, కృష్ణా నది తీరాన కొలువై ఉంది. 4.5 ఎకరాల విశాల ప్రాంగణంలో, భారీ పద్మంపై 125 అడుగుల ఎత్తుతో ధ్యాన ముద్రలో ఉన్న ఈ బుద్ధుని విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రాజధాని ప్రాంతానికే ఐకానిక్‌గా నిలిచిన ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Similar News
News January 5, 2026
బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్ నీటిలో 3గ్రా. కార్బరిల్ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 5, 2026
రేపు సిరిసిల్లకు కవిత.. సర్వత్ర ఆసక్తి

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత తొలిసారిగా జాగృతి అధ్యక్షురాలు <<18764978>>కల్వకుంట్ల కవిత<<>> సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తన అన్న ఇలాకాలో కవిత ఈనెల 6, 7 తేదీల్లో పర్యటించనున్నారు. జిల్లాలో మొదటి రోజు తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణం, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటన సాగనుండగా, జాగృతి నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
News January 5, 2026
ములుగు: సన్న బియ్యంలో నూకలు.. ఎక్కడివి?

జిల్లా వ్యాప్తంగా చౌక ధరల( రేషన్ షాప్) దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు రావడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిలో బియ్యంలో 100 గ్రాముల వరకు నూకలు వస్తున్నాయని సన్న బియ్యం లబ్ధిదారులు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యంలో నూక శాతానికి తరుగు తీసి, ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యంలో నూకలు ఎక్కడివని సన్న బియ్యం లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.


