News December 31, 2025

మార్టిన్‌కి సోకిన మెనింజైటిస్ వ్యాధి ఇదే!

image

AUS మాజీ క్రికెటర్ డామీన్ <<18720461>>మార్టిన్<<>> మెనింజైటిస్ వ్యాధి కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడు- వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు సోకే ప్రమాదకరమైన ఇన్ఫెక్షనే మెనింజైటిస్. ఇది మెదడును దెబ్బతీస్తుంది. వ్యాధి సోకినవారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో వైద్యులను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 13, 2026

పురుషుల్లో తగ్గుతున్న Y క్రోమోజోమ్‌.. జీవితకాలం తగ్గే ప్రమాదం!

image

పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ మగాళ్లు పుట్టడానికి కీలకం. వయసు పెరిగే కొద్దీ వారి కణాల నుంచి ఈ క్రోమోజోమ్‌ను కోల్పోతారని, దీనివల్ల నష్టం లేదని గతంలో సైంటిస్టులు భావించేవారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం Y క్రోమోజోమ్ తగ్గడం వల్ల పురుషులు తీవ్రమైన వ్యాధుల బారిన పడి జీవితకాలం తగ్గుతుందట. అయితే వారసుల్లో ఈ లోపం ఉండదని, మగాళ్ల పుట్టుకపై ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండదని తేలింది. ఇది ఊరటనిచ్చే అంశం.

News February 13, 2026

మండలి నుంచి YCP వాకౌట్

image

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.

News February 13, 2026

First Time: ట్రాన్స్‌జెండర్ విజయం

image

TG: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలుపొందారు. రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.