News December 31, 2025

సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

image

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.

Similar News

News January 4, 2026

‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

image

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.

News January 4, 2026

చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.

News January 4, 2026

SPMVV: ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ (SPMVV) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ (CDOE) 2026 విద్యా సంవత్సరానికి UG/ PG/ PG డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు https://www.spmvv.ac.in/dde/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19.