News December 31, 2025

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై మంత్రి అడ్లూరి సమీక్ష

image

భూపాలపల్లి కేంద్రంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణ రావుతో కలిసి మంత్రి పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రిన్సిపాల్‌లతో చర్చిస్తున్నారు.

Similar News

News January 11, 2026

మేడారంపై తలో మాట.. ఇంతకీ పనుల శాతమెంత!

image

మేడారం పనులపై ఎవరికీ వాళ్లు ఇంత శాతం పనులు అయ్యాయంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారు. మొన్న మంత్రి పొంగులేటి ప్రెస్‌మీట్‌లో 95 శాతమన్నారు. నిన్న సీతక్క ఇంకా పనులు కావాలన్నారు. కలెక్టర్ 80 శాతం పనులు అయ్యాయన్నారు. ఒక పక్క డెడ్ లైన్లు తరచూ మారుస్తున్నారు. మొన్న పొంగులేటి 12 వరకు అనగా, తాజాగా సీఎం వచ్చే వరకు పూర్తి చేస్తామని సీతక్క వెల్లడించారు. పనులు ఎంత మేర జరిగాయో వారికే క్లారిటీ లేకుండా పోయింది.

News January 11, 2026

11x12x20: మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసే మ్యాజిక్ ఫార్ములా

image

ఎంత డబ్బు సంపాదించినా దాన్ని సరిగా ఇన్వెస్ట్ చేసే తెలివి ఉండాలి. 11x12x20 సింపుల్ ఫార్ములా అందుకు ఒక స్మార్ట్ వే. నెలకు ₹11,000 చొప్పున 12% రిటర్న్స్ ఇచ్చే సాధనాల్లో 20 ఏళ్లు SIP చేయాలి. చివరకు కాంపౌండింగ్ మ్యాజిక్‌తో మీ చేతికి ఏకంగా ₹కోటి వస్తాయి. మీరు పెట్టేది కేవలం ₹26.4 లక్షలే అయినా వచ్చే లాభం మాత్రం ₹83.5 లక్షలు. రిటైర్మెంట్ ప్లాన్ లేదా పిల్లల చదువుల కోసం ఇది బెస్ట్ ఆప్షన్.

News January 11, 2026

జీవీఎంసీ బడ్జెట్ రెడీ… రేపు స్థాయి సంఘంలో చర్చ!

image

జీవీఎంసీ బడ్జెట్ తుదిమెరుగులు దిద్దారు. కమిషనర్ కేతన్గర్, మేయర్ శ్రీనివాసరావు కలిసి బడ్జెట్ రూపకల్పన చేయగా 13 పద్దుల కింద రూ.2064.73 కోట్లు ఆదాయం అని అంచనా వేశారు. జీవీఎంసీకి సొంతంగా అన్ని విభాగాల నుంచి 1749.68 కోట్లు సమకూర్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాలను సోమవారం జరిగే స్థాయి స్థానం సమావేశంలో సభ్యులతో సలహాలు తీసుకొని తుది మార్పులు చేసి ఆమోదం తెలపనున్నారు.