News December 31, 2025
న్యూ ఇయర్.. 72 వాహనాలు సీజ్: VKB SP

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు తనిఖీల్లో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,895 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 5, 2026
కడప పోలీస్ గ్రీవెన్స్‌కు 81 అర్జీలు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో SP నచికేత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, ఆయనకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య ఉన్నా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అప్పటికప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు.
News January 5, 2026
కోనసీమలో గ్యాస్ లీక్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

* <<18770518>>లీకేజీ ప్రభావిత<<>> ప్రాంతాల్లోని కార్మికులు, ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
* తరలింపు సాధ్యం కాకపోతే కిటికీలు, తలుపులు, వెంటిలేషన్ వ్యవస్థలను ఆపేసి ఇంటి లోపలే ఉండండి.
* మీ ముక్కు, నోటిని తడి గుడ్డతో కప్పుకోండి.
* శ్వాస రేటును పెంచే కార్యకలాపాలను నివారించండి.
* నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, మైకం, కళ్లు, గొంతు సమస్యలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.
News January 5, 2026
రూ.5 కోట్లతో తీస్తే రూ.50 కోట్ల కలెక్షన్లు

దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో రూ.5 కోట్లతో తెరకెక్కిన మలయాళ మూవీ ‘ఎకో(eko)’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 378% లాభాలతో మలయాళంలోనే 2025లో అత్యధిక ప్రాఫిట్ వచ్చిన చిత్రంగా నిలిచింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో సందీప్ ప్రదీప్, సౌరభ్ సచ్‌దేవ్, బియానా మోమిన్, వినీత్ కీలక పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో(తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది.


