News December 31, 2025
జగిత్యాల: విద్యా దీవెన దరఖాస్తులు మార్చి 31 వరకు

జగిత్యాల జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులపై జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ 31 మార్చి 2026 కాగా, దరఖాస్తులు E-PASS వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.
Similar News
News February 24, 2026
వెండి, బంగారు నగలు కలిపి ఉంచితే?

చాలామంది బంగారం, వెండి నగలను కలిపి భద్రపరుస్తారు. అయితే ఈ రెండింటినీ కలిపి ఉంచడం సరి కాదంటున్నారు నిపుణులు. వెండి రియాక్టివ్ మెటల్. ఇది ఏదైనా ఇతర లోహంతో కలిసినప్పుడు మూలకాలు ప్రతిస్పందించి చర్య మెుదలవుతుంది. నెమ్మదిగా వెండి ఆభరణాలపై బంగారు పొర ఏర్పడుతుంది. బంగారం నాన్-రియాక్టివ్ మెటల్. అది ఏ లోహంతోనూ స్పందించదు. కానీ క్రమంగా మెరుపు తగ్గుతుంది. కాబట్టి వీటిని విడివిడిగా భద్రపరచాలని సూచిస్తున్నారు.
News February 24, 2026
ఖమ్మం చెంతకు ‘కలియుగ వైకుంఠం’..!

ఖమ్మం ధంసలాపురంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఆలయంతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తుమ్మల వెల్లడించారు.
News February 24, 2026
కాసేపట్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 గంటల్లో గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రాత్రంతా హైదరాబాద్‌లో <<19222449>>భారీ వర్షం<<>> కురిసిన విషయం తెలిసిందే.


