News April 24, 2024
మెదక్ జిల్లాకు అథిరధులు వస్తున్నారు..

మెతుకు సీమకు వివిధ పార్టీల అతిరథులు వస్తున్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరుస పర్యటనలతో రాజకీయ వేడి పెంచబోతున్నారు. ఈనెల 25వరకు స్వీకరించనుండగా BJP అభ్యర్థి రఘునందన్, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్లు వేశారు. ఈనెల 24న BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. 25న అమిత్ షా సిద్దిపేటకు రానుండగా, మే 7, 8, 10తేదీల్లో కేసీఆర్ రానున్నారు. ప్రియాంక గాంధీని వచ్చే అవకాశాలున్నాయి.
Similar News
News November 14, 2025
విద్యాసాగర్ రావు కృషి అసామాన్యం: హరీశ్ రావు

సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ‘నీళ్ల సారు’ విద్యాసాగర్ రావు అసామాన్యమైన కృషి చేశారని ఆయన కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జల దోపిడీని, తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, చైతన్యపరచడంలో విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని హరీశ్ రావు తెలిపారు.
News November 13, 2025
మెదక్: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. బుధవారం ఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణం కొనుగోళ్లకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.
News November 12, 2025
మెదక్: ‘ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.


