News December 31, 2025
కాకినాడ ఎంపీ రిపోర్ట్ కార్డ్ ఇదే!

కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ 2025లో కనబరిచిన అత్యుత్తమ పనితీరును పార్లమెంటు బుధవారం వెల్లడించింది. ఆయన మొత్తం 90 శాతం హాజరు నమోదు చేయగా, 17 చర్చల్లో పాల్గొని 58 ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాలకు 100 శాతం హాజరై తన నిబద్ధతను చాటుకున్నారు. ఎంపీ పనితీరుపై పార్టీ నాయకత్వం హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ చూపుతున్నారు.
Similar News
News February 23, 2026
కొత్తగూడెం కార్పొరేషన్.. సౌకర్యాలు అంతంతే..!

కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ఇటీవల కార్పొరేషన్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్లు, మేయర్, డి.మేయర్ ప్రమాణ స్వీకారం.. పాత కౌన్సిల్ హాల్‌లోనే పూర్తి చేశారు. ఈ నెలలోనే పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సి ఉండగా పాత హల్లోనే పాలకవర్గం నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
News February 23, 2026
కర్నూలులో కెరీర్ గైడెన్స్ సెమినార్ సక్సెస్

కర్నూలులోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం Way2News & Resonance సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మెగా కెరీర్ గైడెన్స్ సెమినార్ విజయవంతమైంది. CBI మాజీ JD లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై అవగాహన కల్పించారు. జేడీ సూచనలు తమను ఎంతో ప్రభావితం చేశాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News February 23, 2026
పథకాల అమలులో AI.. అక్రమాలకు చెక్!

TG: సంక్షేమ పథకాల అమలులో AI టెక్నాలజీ వాడాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయించింది. దీని వల్ల అక్రమాలకు చెక్ పడుతుందని, పథకాలు నిజమైన అర్హులకే చేరుతాయని భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని శాఖల డేటాబేస్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి లింక్ చేస్తారని, లబ్ధిదారుల లిస్టు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుందని సమాచారం. ఎవరైనా నకిలీ వివరాలతో లబ్ధి పొందాలని చూస్తే డేటా మ్యాచింగ్ ద్వారా ఏఐ గుర్తిస్తుంది.


