News April 24, 2024
గొట్టిపాడు వాగు వద్ద మహిళ మృతదేహం కలకలం

చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు వాగు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ వయసు 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే చిలకలూరిపేట రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.
Similar News
News March 14, 2026
మంగళగిరిలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష

కుంచనపల్లిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఆహార భద్రత శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఆహార భద్రత సూచీలో దేశంలో తొలి 10 స్థానాల్లో నిలవాలని లక్ష్యంగా పెట్టాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేయాలన్నారు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయన్నారు.
News March 14, 2026
గుంటూరు: రెవెన్యూ అధికారుల సస్పెండ్

భూమి మ్యుటేషన్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన తాడికొండ MRO పి.మెహర్ కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎన్. హనుమంతరావు, VROలు టి.బ్రహ్మయ్య, జి.రాంబాబును కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో లోపాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.