News December 31, 2025

శేష జీవితం ఆరోగ్యం, ఆనందంగా గడపండి: ఎస్పీ మాధవరెడ్డి

image

ఉద్యోగ విరమణ అనేది వృత్తికేని శరీరాన్ని కాదని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్ఐ తిరుపతిరావును ఘనంగా సన్మానించారు. సభలో ఎస్పీ మాట్లాడుతూ..శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కోరారు. ఉమ్మడి జిల్లాల్లో పోలీస్ శాఖలో సేవలు మరువలేనిదని కొనియాడారు. జిల్లా పోలీసు అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

image

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.

News January 23, 2026

బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

image

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.

News January 23, 2026

ప.గో: వైద్య శాఖ అభ్యంతరాలకు దరఖాస్తులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని డీఎంహెచ్వో అమృతం గురువారం స్పష్టం చేశారు. Pharmacist (Contract Basis) టెంటేటివ్ మెరిట్ లిస్టు https://westgodavari.ap.gov.in/ వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేదీ 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.