News December 31, 2025
KMM: పులిగుండాల ఎకో టూరిజం సఫారీ వాహనాలు ప్రారంభం

ప్రభుత్వంతో పాటు సమాజం కలిస్తేనే అడవుల సంరక్షణ బలపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. పులిగుండాల ఎకో టూరిజం వద్ద ఏర్పాటు చేసిన సఫారీ వాహనాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యేతో కలిసి వాహనాలను ప్రారంభించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.
Similar News
News January 1, 2026
ఖమ్మం: సదరం సేవలపై సెర్ప్ సీఈవో సమీక్ష

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News January 1, 2026
ఖమ్మం: కొత్తగా ఐదు కుష్టు వ్యాధి కేసులు

ఖమ్మం జిల్లాలో కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పూర్తైనట్లు డీఎంహెచ్‌ఓ డా.రామారావు తెలిపారు. గత నెల 18 నుంచి 31 వరకు 2.55 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించగా 1,369 మంది అనుమానితులను గుర్తించారు. తుది పరీక్షల అనంతరం 5 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారికి ఉచిత మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.
News January 1, 2026
ఖమ్మం: ఎన్పీడీసీఎల్ ఉత్తమ అధికారుల ర్యాంకులు

నవంబర్ నెలకు సంబంధించి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన అధికారుల ర్యాంకులను సంస్థ ప్రకటించింది. అర్బన్ విభాగంలో ఏడీఈ నాగార్జున, ఏఈ తిరుపయ్య, రూరల్ విభాగంలో ఏఈ అనిల్ కుమార్ ర్యాంకులు సాధించారు. సర్కిల్ స్థాయిలో డీఈ రాములు, ఏడీఈ యాదగిరి, రామారావు, ఏఈ రవికుమార్, అబ్దుల్ ఆసీఫ్ ప్రతిభ కనబరిచారు. విధి నిర్వహణలో ప్రతిభ చాటిన అధికారులను పలువురు అభినందించారు.


