News December 31, 2025

జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు

image

నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

Similar News

News January 3, 2026

గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

image

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News January 3, 2026

1146పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

<>SBI<<>> 1146 స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. తొలుత 996 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. మరో 150 పోస్టులను కలిపి గడువును JAN 10కి పొడిగించింది. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. sbi.bank.in

News January 3, 2026

రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!

image

దేశంలో మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఆ నోట్ల చెలామణీ నిలిచిపోతుందన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావద్దని సూచించింది. కాగా గత జూన్‌లోనూ ఇలాంటి <<16594040>>ప్రచారమే<<>> జరిగింది.