News December 31, 2025
వరంగల్: తరలివచ్చిన చిరుధాన్యాలు.. పెరిగిన ధరలు

WGL ఎనుమాముల మార్కెట్‌కి ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే నేడు ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,490 ధర రాగా.. ఈరోజు రూ.8,550 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్న రూ.5,400 ధర పలికితే.. నేడు రూ.5,600 పలికింది. అలాగే, క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,050 ఉండగా, ఈరోజు రూ.2,055 అయింది. ఎల్లో రకం మిర్చికి రూ.23వేలు, పసుపుకి రూ.13,200 ధర వచ్చాయి.
Similar News
News January 15, 2026
ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
News January 15, 2026
ఎద్దు మోసినంత, గోనె పట్టినంత

పూర్వకాలంలో ధాన్యాన్ని లేదా వస్తువులను కొలవడానికి పెద్ద గోనె సంచులను ఉపయోగించేవారు. ఒక ఎద్దు ఎంత బరువును మోయగలదో, ఒక పెద్ద గోనె సంచిలో ఎంత పరిమాణం పడుతుందో అంత ఎక్కువగా (అంటే చాలా సమృద్ధిగా) ఒకరి దగ్గర ధనం కానీ, వస్తువులు కానీ ఉన్నాయని చెప్పడానికి ఈ సామెతను వాడతారు. ముఖ్యంగా అపారమైన ఐశ్వర్యాన్ని లేదా విపరీతమైన లాభాన్ని సూచించడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 15, 2026
భారత్ మద్దతు కోరుతున్న ఇరాన్!

ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. మరోవైపు యుద్ధం చేస్తామంటూ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ సాయాన్ని ఇరాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా తెలిపారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ ఆ దేశంలోని పరిస్థితులపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.


