News December 31, 2025

ASF: ‘కొత్త వ్యక్తుల వెరిఫికేషన్ తప్పనిసరి’

image

ఇళ్లలో వంట మనుషులు, వాచ్‌మెన్‌లు, కార్మికులుగా అపరిచితులను నియమించుకునేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ సూచించారు. కొత్త వ్యక్తుల గత చరిత్ర, ప్రవర్తన, నేర నేపథ్యం తెలుసుకోవడం వల్ల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కూడా అద్దెదారుల వివరాలను పోలీసులకు తెలపాలన్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రజల రక్షణ కోసమేనని, అందరూ సహకరించాలని కోరారు.

Similar News

News February 19, 2026

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా సమయంలో పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.

News February 19, 2026

దర్యాప్తు పూర్తయ్యే వరకు రామ్మోహన్ తప్పుకోవాలి: రోహిత్ పవార్

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ <<19106331>>మరోసారి<<>> కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కూలిపోయిన ఎయిర్‌క్రాఫ్ట్ VSR వెంచర్స్‌కు చెందినది. దీని ఓనర్‌ రోహిత్ సింగ్‌కు TDP, కేంద్ర మంత్రి రామ్మోహన్‌ క్లోజ్. దర్యాప్తు సజావుగా సాగాలంటే ఆయన పదవి నుంచి తప్పుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అజిత్ మరణంపై భార్య సునేత్ర CBI దర్యాప్తు కోరడాన్ని ఆయన స్వాగతించారు.

News February 19, 2026

గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

image

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.