News December 31, 2025
2025: భారత వనితల జైత్రయాత్ర!

ఈ ఏడాది భారత మహిళలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. రచయిత్రి బానూ ముస్తాక్ బుకర్ ప్రైజ్ సాధించగా, రచయిత్రి పాయల్ కపాడియా కేన్స్‌లో మెరిశారు. సామాజిక సేవలో వర్ష దేశ్‌పాండే(UN అవార్డు), పర్యావరణంలో డా.సొనాలి ఘోష్, జయశ్రీ వెంకటేశన్ అవార్డులు అందుకున్నారు. మహిళల అంధుల జట్టు T20 WC, ఉమెన్స్ టీమ్ ODI WC నెగ్గింది. ఇంజినీర్ మాధవిలత ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
Similar News
News February 21, 2026
ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1961: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ జననం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
News February 21, 2026
పాక్‌లో ‘డెత్ స్క్వాడ్’.. 8 నెలల్లో 924 మంది హతం!

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో నేర నియంత్రణ శాఖ(CCD) డెత్ స్క్వాడ్‌లా మారింది. 2025లో ఏర్పాటైన ఈ విభాగం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏకంగా 670 ఎన్‌కౌంటర్లు చేసింది. పోలీసు కాల్పుల్లో 924 మంది చనిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారని రికార్డుల్లో పేర్కొన్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. 8 నెలల్లో సగటున రోజూ 2 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయని, ఒక్క లాహోర్‌లోనే 139 జరిగాయని చెప్పింది.
News February 21, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


