News April 24, 2024

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

image

ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రాఘురాం రెడ్డి పేరుతో నామినేషన్ దాఖలు అయింది. ఈ సందర్భంగా నాయకులు నూకల నరేశ్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి రాఘురాం రెడ్డి తరుపున కలెక్టర్ గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు. అయన అభ్యర్థిత్వాన్నే ఆదిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది.

Similar News

News March 5, 2026

ఖమ్మం: మినరల్‌ వాటర్ పేరిట.. రోగాల విక్రయం!

image

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఐఎస్‌ఐ మార్క్, ల్యాబ్ సౌకర్యం లేకుండానే బోరు నీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఒక లీటర్ నీటి కోసం మరో లీటర్ వృధా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాణ్యత లేని నీటితో రోగాల బారిన పడుతున్నామని, అధికారులు కల్తీ నీటి ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News March 5, 2026

జిమ్‌లో వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.36లోని ఎస్బో జిమ్‌లో ఈ నెల 3 మధ్యాహ్నం వ్యాయామం పూర్తి చేసుకున్న అనిల్ చౌదరి వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 5, 2026

ఖమ్మం:కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

image

ఖమ్మం జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా, సుమారు 17 వేల మంది అర్హులు ఆశగా వేచి చూస్తున్నారు. గత మూడేళ్లుగా కొత్త దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా తమకు ‘చేయూత’ లభిస్తుందని బాధితులు ఆశీస్తున్నారు