News December 31, 2025
మేడారం జాతరకు 12వేల మందితో బందోబస్తు: ఎస్పీ

మేడారం జాతరలో 12వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో 20 మంది ఐపీఎస్ అధికారులు పనిచేస్తారని వెల్లడించారు. తొలిసారిగా డ్రోన్ కామాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. 20 డ్రోన్లతో ట్రాఫిక్, క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. 460 సీసీ కెమెరాలతో లైవ్ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News January 7, 2026
అమరావతిలో నేటి నుంచి మరోసారి ల్యాండ్ పూలింగ్

అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం బుధవారం నుంచి మరోసారి భూసమీకరణ ప్రారంభించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1,937 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు, కాగా పల్నాడు(D) అమరావతి మండలంలోని వైకుంఠపురం 3,361 ఎకరాలు, పెదమద్దూరు 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166, కర్లపూడి-లేమల్లె 2,944 ఎకరాలుగా సమీకరణ చేయనుంది.
News January 7, 2026
కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై బస్సు దగ్ధం.. విచారణ వేగవంతం

కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై జరిగిన RRR ట్రావెల్స్ <<18784837>>బస్సు ప్రమాద<<>> ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారగా..బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్‌నెస్ నిబంధనలపై RTO ఆరా తీస్తున్నారు.
News January 7, 2026
NRPT: 90 గంటల పాటు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

నారాయణపేట మండలం ఏలూరు వద్ద బటర్‌ఫ్లై వాల్వ్ మరమ్మతుల కారణంగా మక్తల్ నియోజకవర్గంలో నేటి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్ల జిల్లాలోని 8 మండలాలు, 184 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలకు 90 గంటల పాటు అంతరాయం కలగనుంది. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.


