News December 31, 2025
జగిత్యాల: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ బి.సత్యప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం జిల్లాలోని ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజల భాగస్వామ్యం, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. రాబోయే ఏడాదిలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆయన అధికారులకు సూచించారు.
Similar News
News January 12, 2026
బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ ఆజగర్

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్కే ఆలీ అజగర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అజగర్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని అధికారికి కలెక్టర్ సూచించారు.
News January 12, 2026
మున్సిపల్ ఎన్నికలు.. మొత్తం 51.92 లక్షల మంది ఓటర్లు

TG: మున్సిపాలిటీల్లోని తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో మొత్తం 51,92,220 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 631 మంది ఇతర ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించింది. కాగా ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News January 12, 2026
సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.


