News December 31, 2025

అనకాపల్లి జిల్లాలో 92.45 శాతం పింఛన్లు పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 5.42 గంటల వరకు 92.45 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 2,55,680 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,36,385 మందికి అందజేసినట్లు పేర్కొన్నారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.93 మందికి పింఛన్లు పంపిణీ చేసామన్నారు. మిగిలిన వారికి ఈనెల రెండవ తేదీన పంపిణీ చేస్తామన్నారు.

Similar News

News January 1, 2026

పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

image

కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1,912కు చేరింది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు LPG ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

News January 1, 2026

తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు

image

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, సమగ్ర అభివృద్ధి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

News January 1, 2026

APPLY NOW: పవన్ హాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/