News December 31, 2025
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని, జిల్లా అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. వేడుకలను క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
Similar News
News February 9, 2026
ఖమ్మం: కాసేపట్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. బుధవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48గంటల ముందే మైకులు బంద్ కానున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ల ప్రచారం చివరిఅంకానికి చేరుకుంది. మరో అరగంటలో(5 గం.ల నుంచి) బహిరంగ సభలు, ప్రచార వాహనాలు తిరగడం నిషిద్ధం. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వైన్ షాపులూ పోలింగ్ ముగిసేవరకు మూతపడనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News February 9, 2026
తిర్యాణిలో మావోయిస్టుల కదలికలు!

తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 9, 2026
UK పీఎంగా తొలిసారి ముస్లిం వ్యక్తి?

తొలిసారి ముస్లిం వ్యక్తి UK PM పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత PM స్టార్మర్ సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఫైల్స్ దుమారంలో చిక్కుకోవడంతో అధికార లేబర్ పార్టీలో ప్రకంపనలు రేగాయి. త్వరలో ఆయన పదవి కోల్పోతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు హోం సెక్రటరీగా ఉన్న షబానా మహమూద్(45) PM పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. షబానా పేరెంట్స్‌కు పాక్ మూలాలున్నాయి.


