News December 31, 2025
విద్యుత్ షాక్‌తో సత్యసాయి జిల్లా యువకుడు మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వివరాల మేరకు.. రొళ్ల మండలం అలుపనపల్లి గ్రామానికి చెందిన శిరీష్ రెడ్డి (26) GN పాళ్యం వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ వద్ద కనెక్షన్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 2, 2026
అయిజ: యూరియా కొరత లేదు- జిల్లా వ్యవసాయ అధికారి

గద్వాల జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అయిజలో పర్యటించి పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ ఉన్నంతవరకు రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.
News January 2, 2026
ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.
News January 2, 2026
గుంటూరు: 3 చట్టసభల ఘనాపాఠి.. కల్లూరి చంద్రమౌళి

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయంలో కల్లూరి చంద్రమౌళిది చెరగని ముద్ర. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆపై ఏర్పడిన ఆంధ్రప్రదేశ్.. ఇలా 3 వేర్వేరు చట్టసభల్లో ఆయన MLA, మంత్రిగా పనిచేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన ఆయన ఈ ఘనతను సాధించిన తొలి వ్యక్తిగా, రాష్ట్రంలో రికార్డు కలిగిన అతికొద్ది మందిలో ఒకరిగా చరిత్రకెక్కారు. నేడు ఆయనది వర్ధంతి.


