News December 31, 2025

JGL: జిల్లాలో తగ్గుముఖం పట్టిన నేరాలు

image

జిల్లాలో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. పోలీసు గణాంకాల ప్రకారం.. 2024లో జిల్లా వ్యాప్తంగా 5,919 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 5,620కి తగ్గింది. గతేడాది కంటే ఈసారి 299 కేసులు తక్కువగా నమోదయ్యాయి. వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా చూస్తే.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 770 కేసులు నమోదయ్యాయి. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో 135 కేసులు నమోదయ్యాయి.

Similar News

News January 15, 2026

NTR: 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్..!

image

గాయత్రి నగర్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న ఓ మహిళ మెడలో నుంచి రూ. 9 లక్షల విలువైన బంగారు గొలుసును తెంచుకుపోయిన పటమటకు చెందిన మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఏసీపీ దామోదర్ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.

News January 15, 2026

శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

image

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.

News January 15, 2026

యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

image

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.