News December 31, 2025

నల్గొండలో ‘నార్కోటిక్’ నిఘా

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నల్గొండలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ పరిసరాల్లో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాల సహాయంతో అనుమానిత బ్యాగులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని, ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Similar News

News January 2, 2026

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.

News January 2, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన నల్గొండ ఎస్పీ

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో ఎస్పీ మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని పలు అంశాలపై వారు క్లుప్తంగా చర్చించుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొని కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.

News January 2, 2026

పొగమంచుతో ప్రయాణం.. తస్మాత్ జాగ్రత్త: నల్గొండ ఎస్పీ

image

చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు అతివేగం, ఓవర్‌టేకింగ్‌లకు దూరంగా ఉండాలని కోరారు. వాహనాలకు తప్పనిసరిగా ఫాగ్ లైట్లు వాడాలని, ముందు వాహనానికి సురక్షిత దూరం పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.