News April 24, 2024

HYD: జగద్గిరిగుట్ట వాసి హత్య

image

సంగారెడ్డి జిల్లా కోహిర్‌‌లో HYDకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.

Similar News

News January 10, 2026

HYD: మాదాపూర్‌లో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

News January 10, 2026

HYD: అందమైన అమ్మాయి ఫొటో.. క్లిక్ చేస్తే!

image

సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలల్లో యువత చిక్కుకుంటున్నారు. ఇన్‌స్టా‌గ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వేదికగా అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆఫర్స్ అంటూ లింకులు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల మేడ్చల్(D) మల్లాపూర్‌కు చెందిన ఓవ్యక్తి రూ.42,590 పోగొట్టుకున్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా తగ్గటం లేదు.

News January 10, 2026

HYD: ఫోన్ హ్యాక్ అయిందా.. ఇలా చేయండి!

image

సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CERT ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మెసేజెస్ పంపుతుంది. మీరు సైబర్ నేరాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. బోట్నెట్ ఇన్ఫెక్షన్లు, మాల్వేర్ల నుంచి మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచడానికి, CERT-In GoI https://www.csk.gov.inలో ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని HYD టీమ్ సూచించింది.