News December 31, 2025

2026లో టీమ్‌ఇండియా షెడ్యూల్ ఇదే

image

టీమ్‌ఇండియా 2026 జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్‌, 3 మ్యాచుల ODI సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో T20 వరల్డ్ కప్, జూన్‌లో AFGతో 3 వన్డేలు, 1 టెస్ట్, జులైలో ENGతో 5 T20s, 3 ODIs, AUGలో SLతో రెండు టెస్టులు, సెప్టెంబర్‌లో AFGతో 3 T20s, WIతో 3 వన్డేలు, 5 T20s, ఆక్టోబర్-నవంబర్‌లో NZతో 2 టెస్టులు, 3 వన్డేలు, డిసెంబర్‌లో శ్రీలంకతో 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది.

Similar News

News February 12, 2026

హెన్నాతో ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.

News February 12, 2026

ఈ దశలో మామిడి పూతపై మందుల పిచికారీ వద్దు

image

మామిడి చెట్లలో పూత పూర్తిగా విడిగిన దశలో ఎలాంటి పురుగు మందులను చెట్లపై పిచికారీ చేయవద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ దశలో పురుగు మందుల పిచికారీ వల్ల మామిడి పిందెలు కట్టడానికి సాయపడే కీటకాలు, తేనెటీగలు చనిపోతాయి. పూలలోని పుప్పొడి, మందు ద్రావణంలో కొట్టుకుపోతుంది. దీని వల్ల పూలలో సంపర్కం జరగక పిందెలేర్పడవు. అందుకే ఈ సమయంలో నిపుణుల సలహాలను రైతులు తప్పక తీసుకోవాలి.

News February 12, 2026

బ్రిటిష్ పార్లమెంటులో సభ్యుడిగా తెలుగోడు!

image

TG: బ్రిటిష్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జీవిత కాల సభ్యుడి(Life Peer)గా ఉదయ్ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. భగవద్గీతపై ఆయన ప్రమాణం చేయడం గమనార్హం. సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు 25 ఏళ్ల కిందట UK వెళ్లారు. గాంధేయవాదాన్ని పెంపొందిస్తూ, AI, గ్లోబల్ గవర్నెన్స్‌పై కృషి చేస్తున్నారు. ఇలా సమాజ సేవ చేసిన వారిని Life Peerతో UKలో సత్కరిస్తారు. ఇకపై ఆయన్ను ‘లార్డ్ నాగరాజు’గా పిలుస్తారు.