News April 24, 2024
ప్రతిపక్షంలో ముద్దులు.. అధికారంలో పిడిగుద్దులు: బాబు

AP: సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ‘అప్పట్లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సొంత చెల్లికే ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటోంది. రాష్ట్రంలోని ప్రతీ మహిళను లక్షాధికారి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 14, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో రూ.120కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలి రోజు ప్రీమియర్స్తో కలిపి రూ.84కోట్లు సాధించిన విషయం తెలిసిందే. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పండుగ సెలవుల నేపథ్యంలో ఈ వారం కలెక్షన్లు భారీగా పెరిగే ఛాన్సుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
News January 14, 2026
ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!

ఇవాళ మనం జరుపుకుంటున్న భోగి ఎంతో విశిష్టమైంది. నేడు షట్తిల ఏకాదశి. భోగి పండగ రోజు ఏకాదశి తిథి రావడమే దీని ప్రత్యేకత. ఇలా మళ్లీ 2040 వరకు జరగదు. షట్తిల ఏకాదశి రోజు నువ్వులు దానం చేయాలి. వీటితో పాటు బెల్లం, దుస్తులు, నెయ్యి, ఉప్పు, చెప్పులు, దుప్పట్లు దానమిస్తే మంచిది. ఇవాళ ఉపవాసం ఉంటే భగవంతుడి కృపతో కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
News January 14, 2026
సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేయాలి?

సంక్రాంతికి వేసే ‘రంగవల్లి’ అంటే రంగుల వరుస అని అర్థం. ఇంటి ముంగిట ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమే కాదు, బియ్యప్పిండితో వేయడం వల్ల మూగజీవాలకు ఆహారం కూడా లభిస్తుంది. ముగ్గుల్లోని జ్యామితీయ ఆకృతులు చూసేవారి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వంగి ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో వాడే రంగులు సంపదకు, బలానికి సంకేతాలుగా నిలుస్తూ, ఇంటికి శుభాలు చేకూరుస్తాయి.


