News April 24, 2024

కృష్ణా: అంబులెన్స్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

image

విశాఖలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన చందు(20) అతడి స్నేహితుడు రామకృష్ణ (19) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖలో వీరు బైక్‌ పై వెళుతుండగా.. 108 అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు సైతం దారి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, విశాఖ పోలీసులు చందు తల్లికి డబ్బు పంపి విశాఖకు రప్పించినట్లు సమాచారం.

Similar News

News March 17, 2026

కృష్ణా: ఎండలు హీట్.. బొండాల ధరలు హాట్!

image

జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో శీతల పానీయాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు ప్రజలు అధికంగా మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా లభ్యత తగ్గిపోవడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొబ్బరి బొండాలను కృష్ణా జిల్లాకు దిగుమతి చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ఖర్చులు కూడా పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి.

News March 17, 2026

సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

image

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

News March 17, 2026

కృష్ణా: 82 అంగన్వాడీ పోస్టులకు నేడే చివరి తేదీ

image

కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ నెల 17లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించాలని పేర్కొన్నారు.