News April 24, 2024
భద్రాచలం రాములోరికి సుదర్శన చక్రస్నానం

భద్రాచలంలోని శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. మంగళవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి పవిత్ర గోదావరి నది వద్ద విశేష అభిషేకం జరిగింది. అనంతరం పవిత్ర గోదావరి నదిలో సుదర్శన చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తికానున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.
Similar News
News March 20, 2026
రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్ దత్

ఖమ్మం: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.
News March 20, 2026
విద్యుత్ సిబ్బంది భద్రతకు ‘ఎల్సీ యాప్’ కవచం

ఖమ్మం: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.
News March 20, 2026
మండిపోతున్న ఎండలు.. చుక్కల్లో నిమ్మ ధర!

జిల్లాలో భానుడి భగభగలకు తోడు నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. గతంలో డజను రూ. 20-30 పలికిన ధర.. ప్రస్తుతం ఏకంగా రూ. 80-100కు చేరింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో కాయ రూ. 7 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో వినియోగదారులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.


