News January 1, 2026

భద్రాద్రి: విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ గడువు పెంపు.!

image

విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాల దరఖాస్తు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, రిన్యూవల్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

Similar News

News January 2, 2026

ఆసిఫాబాద్ జిల్లాలో రూ.2.25 కోట్లు తాగేశారు

image

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఆసిఫాబాద్ జిల్లాలో డిసెంబర్ 31న ఒకరోజు రూ. 2,25,00,000 విలువైన మద్యం తాగేశారు. ఉట్నూర్ ఐఎంఎల్ డీపో నుంచి 30, 31 తేదీలలో
భారీగా మద్యాన్ని కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.36 కోట్ల మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రూ. 2.25 కోట్ల మద్యం లాగించేశారు.

News January 2, 2026

ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

image

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.