News April 24, 2024
మదన్ రెడ్డి పోయినా BRSకి ఎలాంటి నష్టం లేదు: హరీశ్ రావు

మదన్ రెడ్డి BRSకు నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేశారని.. ఆయన పార్టీ మారినంత మాత్రమే BRSకు వచ్చిన నష్టమేమని లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తన మిత్రుడు అని కేసీఆర్ రెండుసార్లు టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు చేరానని మదన్ రెడ్డి బాధపడుతున్నారని అన్నారు.
Similar News
News March 11, 2026
MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
News March 11, 2026
ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.
News March 10, 2026
అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.


