News January 1, 2026

HYD: NEW YEAR వాట్సాప్ విషెస్ వచ్చాయా?

image

HAPPY NEW YEAR అని వాట్సాప్‌లో ఫొటో వచ్చిందా? జాగ్రత్త. ఈ ఫొటోలో బైనరీ కోడ్ ఉండొచ్చు. దాన్ని డౌన్‌లోడ్ చేస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి పర్సనల్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. దీన్నే డిజిటల్ స్టినోగ్రఫీ స్కామ్ అంటారని నగర పోలీసులు చెబుతున్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు అన్నీ వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి. కొత్త నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తే అస్సలు డౌన్‌లోడ్ చేయొద్దని హెచ్చరించారు.

Similar News

News January 14, 2026

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

image

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.

News January 14, 2026

ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

image

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<>BARC<<>>) 3 పోస్టులను భర్తీ చేయనుంది. MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు జనవరి 22న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. నెలకు రూ.92వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in

News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.