News January 1, 2026
సిద్దిపేట: GREAT.. నలుగురికి పునర్జన్మనిచ్చారు

సిద్దిపేట జిల్లా చేర్యాల PSలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేందర్ ఇటీవల విధులకు వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఈ క్రమంలో నరేందర్ భౌతికంగా లేకపోయినా, మరొకరి రూపంలో జీవించాలనే ఆకాంక్షతో కుటుంబీకులు అవయవదానానికి ముందుకొచ్చారు. ‘జీవన్ దాన్’ సంస్థ ద్వారా గుండె, కాలేయం, కిడ్నీలు సేకరించి నలుగురికి పునర్జన్మనిచ్చారు.
Similar News
News January 13, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <
News January 13, 2026
HYDలో డిమాండ్.. ఆ ఒక్కదానికే రూ.2500

HYDలో పెళ్లళ్లకు బ్యూటీషియన్ల డిమాండ్ పెరిగింది. మగువ మొహాన్ని మెరుపుటద్దంలా మార్చే మేకప్, మరింత అందాన్ని తెచ్చే లేటెస్ట్ మెహంది డిజైన్ల కోసం ఖర్చుకు వెనకాడటం లేదు. నెయిల్ పాలిష్ తర్వాత ఒకే వేలుకు మాత్రమే పెట్టే ఒక్క మెరుపు చుక్కకే రూ.2,500 వరకు ఖరీదు చేస్తున్నారు. మల్టీ వ్యూ డిమాండ్ అని పిలిచే ఈ మెరుపు చుక్కలో నిలబడి చూస్తే ‘వధూవరులు’ మెరుస్తూ కనిపిస్తారు.
News January 13, 2026
చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.


