News January 1, 2026
సంగారెడ్డి: ఆర్థిక పునరావసం కింద దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలోని ట్రాన్స్జెండర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపాధి, పునరావాస పథకాల కింద దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి బుధవారం కోరారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి, 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ దరఖాస్తులను ఈనెల 9లోగా కలెక్టరేట్లోని సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
Similar News
News January 17, 2026
100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్‌ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్‌ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.
News January 17, 2026
MLG: సీఎం పర్యటన.. 1600 మందితో భారీ భద్రత.!

సీఎం మేడారం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 1600 మంది అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీలు సుధీర్ కేకన్, సంకీర్త్ వెల్లడించారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, రోడ్ ఓపెనింగ్ పార్టీలతో అడుగడుగునా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేయడంపై నిషేధం విధించారు. భద్రతలో లోపాలు లేకుండా పనిచేయాలని పోలీస్ సూచించారు.
News January 17, 2026
కొత్తగూడెం: గ్రామాల్లో విద్యాభివృద్ధికి CSR సహకరించాలి: కలెక్టర్

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. గురువారం సీఎస్ఆర్ బృందంతో కలిసి పాల్వంచలోని భవిత కేంద్రం, కోయగట్టు పాఠశాలలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు, బృంద సభ్యులు పాల్గొన్నారు.


