News April 24, 2024

తూ.గో.: మహిళ దారుణహత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెళ్లుగడ్డలో మంగళవారం బొంతు మణికుమారి (30) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాత్రూంలో మాటువేసిన ఆగంతకుడు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. హత్య సమయంలో డోరు లోపల గడియ వేసిఉందని, కిటికీ లోంచి ఆమె తోడికోడలు, కుమారుడు చూసి కేకలు వేశారు. ఎస్ఐ హరీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

Similar News

News March 16, 2026

తూ.గో: టెన్త్ తెలుగు పరీక్షకు 24,166 మంది స్టూడెంట్స్ హాజరు- DEO

image

తూ.గో. జిల్లాలో 138 కేంద్రాల్లో జరిగిన పదవ తరగతి పరీక్షలకు 24,424 మంది విద్యార్థులకు గాను 24,166 మంది హాజరైనట్లు డీఈఓ కె.వాసుదేవరావు తెలిపారు. అలాగే, 26 కేంద్రాల్లో జరిగిన ఏపీ ఓపెన్ స్కూల్ తెలుగు పరీక్షకు 1,833 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని డీఈఓ వెల్లడించారు.

News March 16, 2026

జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి: కలెక్టర్

image

జిల్లాలో అక్షరాంధ్రా కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్య వయోజనులకు ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ పరీక్షకు 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారు. కేవలం 533 మంది మాత్రమే గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

News March 16, 2026

అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

image

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.