News January 1, 2026
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంత మద్యం తాగారో తెలుసా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. డిసెంబరులో రూ.279 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే రూ.51 కోట్లు అదనంగా ఆదాయం రావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 3.20 లక్షల ఐఎంఎల్, 1.44 లక్షల బీరు పెట్టెలు సరఫరా అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.
Similar News
News January 1, 2026
జీడిమామిడి పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.
News January 1, 2026
సిరిసిల్ల: ‘జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు’

జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం వచ్చే నెల రోజులలో జిల్లా పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News January 1, 2026
కర్నూల్: డీఐజీగా విక్రాంత్ పాటిల్‌కి పదోన్నతి

జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి పొందారు. ఆయన గురువారం జిల్లా జడ్జి కబర్థిని, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారికి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలుపగా.. పదోన్నతి పొందిన విక్రాంత్ పాటిల్‌ను జిల్లా జడ్జి, రేంజ్ డీఐజీలు ప్రత్యేకంగా అభినందించారు.


