News January 1, 2026

మండపేటలో ‘ఫ్లెక్సీ’ వార్‌.. YCP బ్యానర్లు తొలగించడంపై భగ్గుమన్న శ్రేణులు!

image

మండపేట పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాల మేరకు ఉదయం హడావిడిగా తొలగించడం వివాదాస్పదమైంది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన బీసీ నాయకులు నిరసన తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నాయకులు మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వక అనుమతి తీసుకున్నట్లు తెలియడంతో కమిషనర్ తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Similar News

News January 2, 2026

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొత్త అందాలు.!

image

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అమ్మాయిలు గ్లామర్ ఫీల్డ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు వెండి తెరపై ఇప్పటికే సందడి చేస్తుండగా మరికొందరు చదువుకొంటునే కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. చిత్తూరుకు చెందిన <<18734489>>అర్చన<<>> ‘శంబాల’తో హిట్ కొట్టగా మిస్ ఆంధ్ర పోటీల్లో టీనేజీ విభాగంలో తవణంపల్లె మండలానికి చెందిన సహస్ర సత్తా చాటింది. ఇదే పోటీల్లో వెంకటగిరి యువతి అక్షయ రెడ్డి ఏకంగా టైటిల్ కొల్లగొట్టింది.

News January 2, 2026

KMM: భూమి కోసం.. పెళ్లి చేసిన పెద్దమ్మనే చంపేశాడు.!

image

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలో భూమి చిచ్చు ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. 27 ఎకరాల భూమి వివాదంలో శేఖర్ అనే రౌడీషీటర్ తన సొంత పెద్దమ్మ రాములమ్మను <<18735205>>కత్తితో పొడిచి<<>> చంపినట్లు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నాతర్లగూడెంలోని భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడి వివాహాన్ని దగ్గరుండి జరిపించిన పెద్దమ్మనే, ఆస్తి వ్యామోహంతో కడతేర్చడం స్థానికంగా కలకలం రేపింది.

News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.