News January 1, 2026

అద్దంకి: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు దోచేశారు

image

CBI నుంచి ఫోన్ చేస్తున్నాం.. మనీ లాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది చెప్పి సైబర్ నేరగాళ్లు అద్దంకి వాసి వద్ద డబ్బులు కాజేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెయిల్ మంజూరు కావాలంటే డబ్బులు చెల్లించాలని అద్దంకికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు నుంచి 3 వారాల క్రితం రూ.1.23 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News January 10, 2026

నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

News January 10, 2026

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News January 10, 2026

KMM: ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మం ఎస్సీ స్టడీసర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఐదు నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 20 నుంచి తరగతులు ప్రారంభిస్తామని.. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.