News April 24, 2024
చెన్నై బదులు తీర్చుకుంటుందా?

IPLలో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే ఓ మ్యాచ్ జరగ్గా.. అందులో లక్నో గెలిచింది. హెడ్ టు హెడ్ రికార్డుల్లోనూ CSK 1-2తో వెనకబడి ఉంది. దీంతో గత మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇందులో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని LSG భావిస్తోంది.
Similar News
News March 16, 2026
చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.
News March 16, 2026
మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్ ఖాన్‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
News March 16, 2026
ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్‌స్టార్
* సిన్నర్స్- జియో హాట్‌స్టార్
* ఫ్రాంకెన్‌స్టైన్- నెట్‌ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్‌ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్‌స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ


