News January 1, 2026

నారాయణపేట: పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలివ్వండి- కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకలలో ఆడంబరాలకు స్వస్తి పలికి, సేవా దృక్పథాన్ని చాటాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. జనవరి 1న తనను కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ దుప్పట్లు తీసుకురావాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ వస్తువులను సేకరించి త్వరలోనే అర్హులైన పిల్లలకు అందజేస్తామని ఆయన తెలిపారు.

Similar News

News January 12, 2026

NLG: రైతు వేదిక.. నిర్వహణ లేక..

image

జిల్లాలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని ఏఈవోలు తెలిపారు. దీంతో కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వేదికలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

News January 12, 2026

అనకాపల్లి: బొలెరో వాహనం బీభత్సం

image

పాయకరావుపేట మండలం నామవరం వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందగా, మరో 20 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. నామవరం నుంచి గొర్రెల కాపరులు పాయకరావుపేట వైపు మందను తోలుతుండగా వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టి ఆగకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News January 12, 2026

KMR: కొడుకుతో కలిసి భోజనం చేస్తూ తండ్రి మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లికి చెందిన కంట్రపల్లి లక్ష్మయ్య(65) ఆదివారం రాత్రి తన కొడుకు అంజయ్యతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా అన్నం ముద్ద నోట్లో ఉండగానే ఎక్కిళ్లు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.