News January 1, 2026

WGL: పోలీసుల నిఘా ఫలితం.. కమిషనరేట్‌లో ‘సున్నా’ ప్రమాదాలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు ప్రమాదరహితంగా ముగిశాయి. పోలీసులు చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ఫలితంగా ఒక్క రోడ్డు ప్రమాదం కూడా నమోదు కాలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, వాహనదారుల వేగానికి బ్రేక్ వేయడంతోనే ఈ విజయం సాధ్యపడింది. ముఖ్యంగా ప్రమాదకరమైన మలుపులు, ప్రధాన రహదారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని పర్యవేక్షించారు.

Similar News

News January 12, 2026

ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.

News January 12, 2026

కనీసం 7 గంటలు నిద్రపోవట్లేదా.. మీ ఆయుష్షు తగ్గినట్లే!

image

నిద్ర సరిగా లేకపోతే సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఏకంగా ఆయుష్షే తగ్గిపోతుందని Oregon Health Science University స్టడీలో తేలింది. ఆయుర్దాయంపై ప్రభావం చూపే జీవనశైలి అలవాట్లను పరిశీలించగా.. స్మోకింగ్ తర్వాత నిద్రే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారి ఆయుష్షు తగ్గుతున్నట్లు గమనించారు. డైట్, వ్యాయామం కంటే కూడా నిద్రే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు.

News January 12, 2026

HZB: అలిశెట్టి ప్రభాకర్‌ ‘యాది’లో..

image

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్‌లో ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జనసాహితి సభ్యుడు విప్లవ్‌ దత్‌ శుక్లా 1991లో జరిగిన ఓ నాటి సమావేశ అరుదైన చిత్రపటాన్ని పంచుకున్నారు. అప్పట్లో జనసాహితి ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్తు హాలులో నిర్వహించిన మహాకవి శ్రీశ్రీ జయంతి సభకు అలిశెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.