News January 1, 2026

2025లో జిల్లాలో ఏ నేరాలు ఎన్ని జరిగాయో తెలుసా..?

image

జిల్లాలో గత ఏడాదితో పోల్చితే 2025 సంవత్సరంలో 15% ప్రమాదాలు తగ్గాయని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. 2024లో 7,586 కేసులు నమోదైతే, 2025లో 6,477 నమోదైనట్లు తెలిపారు. సైబర్ నరాలు 140 నుంచి 123కి, పోక్సో కేసులు 114 నుంచి 110కి, ఆర్థిక నేరాలు 355 నుంచి 302కి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 101 నుంచి 64కి, మాదకద్రవ్యాల కేసులు 69 ఉంటే 52కి, శారీరిక నేరాలు 76 నుంచి 697కు తగ్గాయన్నారు.

Similar News

News April 20, 2026

కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

image

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2026

దళారుల ఉచ్చులో పడకండి: DTO

image

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.