News January 1, 2026
నంద్యాల జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

న్యూ ఇయర్ రోజున నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిలలకు తండ్రి విషం కలిపిన పాలు తాపించి చంపాడు. ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు సురేంద్ర (35), కావ్యశ్రీ (7), సూర్య గగన్ (2), ధ్యానేశ్వరి (4)గా గుర్తించారు. సురేంద్ర భార్య మహేశ్వరి అనారోగ్యంతో గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 13, 2026
జలదాత కాటన్ పుణ్యమే.. నేటి గోదావరి లోగిళ్ల స్వర్ణమయం!

గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ వైబ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే ఈసమయంలో మనం ఓమహానుభావుడిని తప్పకుండా గుర్తుచేసుకోవాలి. 1833లో ‘డొక్కల కరువు’తో గోదావరి జిల్లాలు అల్లాడాయి. ఆకలి కోరల్లో చిక్కుకున్న ఈప్రాంతాన్ని చూసి చలించిన అపర భగీరథుడు ‘సర్ ఆర్థర్ కాటన్’..1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టి గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’గా మార్చింది. కాటన్ దొర సంకల్పమే నేటి సంక్రాంతి సిరిసంపదలకు మూలం.
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలి రోజు ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలో రూ.37.10 కోట్లు వసూలు చేసినట్లు ‘sacnilk’ పేర్కొంది. ఇందులో సోమవారం రూ.28.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రీమియర్ షోల ద్వారా రూ.8.6 కోట్లు రాబట్టింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ టచ్, పండుగ సీజన్‌తో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.
News January 13, 2026
ఖమ్మం: చికెన్ ధరకు రెక్కలు.. సామాన్యుడికి ‘ముక్క’ కష్టమే!

ఉమ్మడి ఖమ్మంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల క్రితం రూ. 250 ఉన్న స్కిన్‌లెస్ కిలో ధర ప్రస్తుతం రూ. 350కి చేరింది. సంక్రాంతి పండుగ, శుభకార్యాల సీజన్‌తో డిమాండ్ పెరగడం, చలి తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. లైవ్ కోడి ధర కూడా రూ. 180 మార్కును దాటింది. రానున్న మేడారం జాతర నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో మాంసప్రియులు ఆందోళన చెందుతున్నారు.


