News January 1, 2026
మహబూబాబాద్‌లో పులి.. నిఘా పెంపు.!

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పులి అలజడి మొదలైంది. గంగారం, కొత్తగూడ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. రాంపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామస్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే, పులులు తోడు కోసం ఈ సమయంలో అటవీ ప్రాంతాలకు రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Similar News
News January 5, 2026
బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్ నీటిలో 3గ్రా. కార్బరిల్ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 5, 2026
రేపు సిరిసిల్లకు కవిత.. సర్వత్ర ఆసక్తి

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత తొలిసారిగా జాగృతి అధ్యక్షురాలు <<18764978>>కల్వకుంట్ల కవిత<<>> సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తన అన్న ఇలాకాలో కవిత ఈనెల 6, 7 తేదీల్లో పర్యటించనున్నారు. జిల్లాలో మొదటి రోజు తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణం, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటన సాగనుండగా, జాగృతి నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
News January 5, 2026
ములుగు: సన్న బియ్యంలో నూకలు.. ఎక్కడివి?

జిల్లా వ్యాప్తంగా చౌక ధరల( రేషన్ షాప్) దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు రావడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిలో బియ్యంలో 100 గ్రాముల వరకు నూకలు వస్తున్నాయని సన్న బియ్యం లబ్ధిదారులు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యంలో నూక శాతానికి తరుగు తీసి, ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యంలో నూకలు ఎక్కడివని సన్న బియ్యం లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.


