News January 1, 2026

GNT: అల్లర్లు లేవు.. పోలీసుల పక్కా ప్లాన్ సక్సెస్.!

image

నూతన సంవత్సర వేడుకలతో గుంటూరు జిల్లా సందడిగా మారింది. పూలబొకేలు, స్వీట్స్, కేకుల విక్రయాలు జోరుగా సాగాయి. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులతో మహిళలు, యువతులు సందడి చేశారు. అర్ధరాత్రి నుంచే యువత శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా యువత కొద్దిగా ఇంటికే పరిమితమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా గుంటూరు జిల్లా పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

Similar News

News January 26, 2026

గుంటూరు: గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

డా. BR అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం జూనియర్ ఇంటర్‌తో పాటు 6 నుంచి 10 తరగతుల్లో బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడవితక్కెళ్లపాడు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు కొనసాగనుందన్నారు. ఆసక్తి గల వారు apgpcet.apcfss.inలో నమోదు చేసుకోవాలన్నారు.

News January 26, 2026

గుంటూరులో నేడు జిల్లా పోలీస్ PGRS రద్దు: ఎస్పీ

image

రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం జాతీయ పండుగ కారణంగా ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News January 26, 2026

గుంటూరు: 350 మందికి అవార్డులు

image

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.