News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

image

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Similar News

News February 16, 2026

పెళ్లికి ముందు శృంగారం.. జాగ్రత్తగా ఉండండి: సుప్రీంకోర్టు

image

వివాహానికి ముందు యువతీయువకులు శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పెళ్లి హామీతో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది. ‘మేం పాత తరం వాళ్లం. ఇప్పటి తరం పెళ్లికి ముందు ఎందుకు ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్తోందో అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ పేర్కొన్నారు.

News February 16, 2026

మేలో శ్రీవారి సేవలు, దర్శనాల కోటా షెడ్యూల్

image

AP: ఈ ఏడాది మే నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు, దర్శనాలు, వసతి టికెట్ల కోటా విడుదల షెడ్యూల్‌ను TTD ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆర్జిత సేవల టికెట్లకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. 21న కళ్యాణోత్సవం, 23న అంగప్రదక్షిణ టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల ఉచిత ప్రవేశ దర్శన కోటా, 24న రూ.300 టికెట్లు, గదుల బుకింగ్, 27న శ్రీవారి సేవ కోటాను రిలీజ్ చేస్తారు.
#ShareIt

News February 16, 2026

మండపారాధన అంటే మీకు తెలుసా?

image

వ్రతం/పూజ చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే ప్రక్రియే మండపారాధన. ఇందులో ప్రధాన దైవంతో పాటు పంచపాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులను కూడా పిలుస్తారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. పూజలో పెట్టే వక్క దేవతాంశకు, పసుపుకొమ్ము స్త్రీ రూప దేవతా శక్తికి, ఖర్జూరం నైవేద్యంగా, అక్షింతలు దేవతా అర్చన కోసం, నాణెం హిరణ్య రూప దక్షిణగా సమర్పిస్తారు. వీటితో గ్రహ దోషాలు పోతాయని నమ్మకం.